విద్యార్థులు క్రీడల్లో, చదువుల్లో, సామాజిక అంశాల్లో అవగాహన పెంచుకుని, దేశసేవలో భాగస్వాములుగా మారాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, నాగరాజు, శశిధర్ అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆదోని పట్టణంలో ఆదివారం మంత్రాలయం బీసీ బాలిక హాస్టల్ విద్యార్థులకు కబడ్డీ, మ్యూజికల్ ఱచైర్, లెమెన్స్ స్పూన్ పోటీలు నిర్వహించారు. అనంతరం గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు.