విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆదోనిలో విద్యుత్ చార్జీల బాదుడుపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, విద్యుత్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఈ హరి, డీఈ పురుషోత్తంకు వినతిపత్రం అందజేశారు.