ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్ ఆదేశాల మేరకు ఆదివారం పట్టణ పరిధిలోని శివారు ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక స్టేడియం సమీపంలో బహిరంగ మద్యపానం చేస్తున్న కొందరు యువకులు డ్రోన్ కెమెరాలను చూసి పరారయ్యారు. ఈ సందర్భంగా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.