ఆళ్లగడ్డ: గుడి నిర్మాణంలో గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలి

73చూసినవారు
ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రి మండలం రాంపల్లి గ్రామంలో రామాలయం గుడి నిర్మాణ విషయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గుడి నిర్మాణం విషయంలో గ్రామస్తులందరినీ భాగస్వాములు చేయాలని ఆదివారం గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకపక్షంగా ఒకే వ్యక్తి గుడి నిర్మిస్తే ఊరుకునేది లేదన్నారు. వ్యక్తిపై ఘర్షణకు దిగడం జరిగింది ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్