కన్నుల పండుగగా శ్రీ సీతారామస్వామి కళ్యాణం

70చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వాడ వాడలలో వెలసిన శ్రీ రామాలయాలలో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. పూజలో పాల్గొన్న భక్తులకు పానకం వడపప్పులతోపాటు తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు.

సంబంధిత పోస్ట్