ఆలూరు: డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

83చూసినవారు
ఆలూరు పట్టణంలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే విరుపాక్షి పథకాన్ని ప్రారంభించి, విద్యార్థులతో మాట్లాడారు. కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు, భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో కో కన్వీనర్ అరికెర వీరేష్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్