ఆలూరు: రహదారి నిర్మాణం కోసం ఈనెల 6న పాదయాత్ర

83చూసినవారు
ఆలూరు నియోజకవర్గంలోని హోళగుంద టూ ఆదోని వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 
ఇన్‌ఛార్జి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గురువారం హోళగుందలో మాట్లాడారు. రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ వామపక్షాలతో కలిసి ఈనెల 6న హెబ్బటం నుంచి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన మండలంగా ఉన్న హొళగుందను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్