ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా జగ్గపులి వేషం ఆదరణ పొందుతుంది. గ్రామానికి చెందిన గొల్ల కర్రెన్న వంశస్థులు గొల్ల రామచంద్ర సోమవారం చిన్న సరిగేసు రోజున పులి ఆటఅడుతూ, గ్రామం వీధి తిరుగుతారు. కేవలం పాలు మాత్రమే తాగి జగ్గపులి ఆట అడుతారు. పులి వేషం వేసిన వ్యక్తికి ఎదురుగా ఎవరు చెప్పులు ధరించారని, అలాగే ఆయనకు భక్తులు మేకలు, పొట్టేలు కానుకగా ఇస్తారు. అని గ్రామస్తులు తెలియజేశారు.