అవుకు మండలం జూనూతల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ లో సీఐఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్ (34) ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయ్యి, తూటా నేరుగా తలను చీల్చుకుంటూ వెళ్లి మృతి చెందినట్లు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం మృతదేహాన్ని అవుకు మండలంలోని స్వస్థలానికి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.