బనగానపల్లెలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

55చూసినవారు
బనగానపల్లెలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
బనగానపల్లె నియోజకవర్గం సంజామల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల అవుకు మండలాల్లో ఆదివారం ప్రజలు గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో సాయినాధుడి ఆలయంలో అభిషేకాలు, అలంకరణ, చెక్కభజన కోలాటాల మధ్య సాయినాథుడి గ్రామోత్సవం, భక్తులకు అన్నదాన కార్యక్రమం, సంధ్యా హారతి, పల్లకీసేవ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు భారీగా తరలి వచ్చి సాయినాథుడిని దర్శించుకొని పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్