కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ రమేష్ బాబు సూచించారు. సోమవారం కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ ఆవరణంలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం, పర్యవేక్షణ నిర్వాహకులు చూసుకోవాలని సీఐ రమేష్ బాబు సూచించారు.