నందవరంలో కన్నుల పండుగగా అమ్మవారి పల్లకి సేవ

73చూసినవారు
బనగానపల్లె మండలంలోని నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా పల్లకిపై అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ. వో కామేశ్వరమ్మ, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్