కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఐటియు జిల్లా కార్యదర్శి టి. శివరాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త బ్లాక్ డే పిలుపు మేరకు డోన్ స్థానిక కొండపేట లోని బేతంచెర్ల సర్కిల్ నందు సోమవారం రాస్తా రోక కార్యక్రమం నిర్వహించారు.