గూడూరు పట్టణంలోని పడమర బీసీ కాలనీ సమీపంలో సోమవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. గూడూరు ఎస్సై తిమ్మయ్య తెలిపిన వివరాల మేరకు కల్లపరికి చెందిన మాదిగరాజు (25) కోడుమూరులోని ఓ గుజురీ దుకాణంలో పనిచేస్తూ, చనుగొండ్లలో నివాసముంటున్నాడు. తాగుడుకు బానిసైన ఈ యువకుడు గూడూరుకు వెళ్లాడు. అక్కడ పూటుగా మద్యం తాగి కిందపడి మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.