గూడూరు నగర పంచాయతీ ప్రజలకు శాశ్వత మంచినీటి సౌకర్యం కొరకు రూ. 52 కోట్లతో ఏఐఐబీ స్కీమ్ పనులు ప్రారంభించాలని టీడీపీ పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ కోరారు. ఆయన గూడూరులో మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ఏఐఐబీ స్కీమ్ ను వైసీపీ ప్రభుత్వం పనులను పూర్తి చేయకుండా సగం మధ్యలోనే వదిలేశారని అన్నారు. గూడూరు ప్రజలకు శాశ్వత మంచినీటి సౌకర్యం కల్పించే అవకాశం వచ్చిందన్నారు.