ఎస్సీ, ఎస్టీ కేసులను కేసులను తప్పుదోవ పట్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సూచించారు. శుక్రవారం కర్నూలులో జరిగిన విజిలెన్స్ అండ్ మానింటరింగ్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. గూడూరు మండలంలోని బాలికల వసతి గృహంలో టాయిలెట్లు సరిగా లేవని, వసతి గృహంలో సీట్ల సంఖ్యను పెంచాలన్నారు.