రైతులు పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించాలి

64చూసినవారు
రైతులు పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించాలి
రైతులు పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించాలని కోడుమూరు ఉద్యావన శాఖ అధికారి మధుసూదన్ గౌడు సూచించారు. శుక్రవారం సి. బెళగల్ మండలంలోని బ్రాహ్మణదొడ్డి, పోలకల్లు, మారందొడ్డి గ్రామాల్లో రైతులు పెంచుతున్న మామిడి, నిమ్మకాయ, జామ తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. సన్నకారు రైతులు పండ్లతోటల పెంపకంతో అధిక దిగుబడి సాధించవచ్చు అన్నారు. రైతులు తోటల్లో అంతర్ పంటలను మూడు ఏళ్ల వరకు సాగు చేసుకోవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్