కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి మంగళవారం పంచలింగాలలోని జిల్లా జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడారు. వారికీ ఉచిత న్యాయ సేవల గురించి తెలియజేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్. మనోహర్, జైలు సూపరింటెండెంట్ బి. చంద్రశేఖర్ ఉన్నారు.