కోడుమూరు: గ్రామసభలతో భూ సమస్యలు పరిష్కారం

71చూసినవారు
కోడుమూరు: గ్రామసభలతో భూ సమస్యలు పరిష్కారం
గ్రామసభలతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని గూడూరు తహసీల్దార్ రామాంజనేయులు అన్నారు. శుక్రవారం గూడూరు మండలం ఆర్. కానాపురంలో రీసర్వేలో వచ్చిన భూ సమస్యలు పరిష్కారంపై గ్రామసభలను నిర్వహించారు. భూముల రీసర్వేలో జాయింట్ ఎల్పీ, ఖాతాలు తప్పుగా పడటం, సర్వే నెంబర్లు అసమతుల్యత, ఇమ్యూటేషన్ సమస్యలపై రైతుల నుండి 11 ఆర్జీలను అధికారులు స్వీకరించారు. ఆర్జీలను పరిశీలించి భూ సమస్యలను పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్