కర్నూలు జిల్లాలో 19 మండలాల్లో వర్షాలు

73చూసినవారు
కర్నూలు జిల్లాలో 19 మండలాల్లో వర్షాలు
కర్నూలు జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు 19 మండలాల్లో వర్షాలు కురిశాయి. కల్లూరు, గూడూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లా సగటున 17. 4 మి. మీ వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్ష పాతం 116. 5 మి. మీ ఉండగా ఇప్పటి వరకు 82. 3 మి. మీ వర్షపాతం నమోదైంది. కల్లూరు 53. 8 మీ. మీ కర్నూలు రూరల్ 36. 2, కర్నూలు అర్బన్ 35. 4, గూడూరు 22. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్