నేడు సి. బెళగల్ లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

72చూసినవారు
నేడు సి. బెళగల్ లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
సి. బెళగల్ మండలంలోని నాలుగు పాఠశాలలో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎంఈవో జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తకోట, పోలకల్, సి. బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుండ్రేవుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల నుంచి 50 శాతం ఉపాధ్యాయులు హాజరు కావాలని ఆదేశించారు. తెలుగు, గణితం, జీవశాస్త్రం అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్