గోస్పాడు: గ్రంథాలయ సృష్టికర్తల ఉద్యమకారుల స్మరణ దినోత్సవం

74చూసినవారు
గోస్పాడు: గ్రంథాలయ సృష్టికర్తల ఉద్యమకారుల స్మరణ దినోత్సవం
గోస్పాడు గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమకారులు గాడిచర్ల హరి సర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్య, ఎస్. ఆర్. రంగనాథన్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాటం ప్రకాష్ శనివారం ప్రారంభించారు. విద్యార్థులకు గ్రంథాలయాల అవసరాన్ని వివరిస్తూ, గ్రంథాలయాలను వినియోగించుకోవాలని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్