జగనన్న కాలనీల్లో పేదలకు ఇచ్చిన ప్లాట్లు కజ్జాలకు గురౌతున్నాయని స్థానికులు మంత్రాలయం తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. గురువారం భూ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మంత్రాలయం మండలం మంచాలలో తహసీల్దార్ ఎస్. రవి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్లు జీకే గురురాజురావు, సరస్వతి, మండల సర్వేయర్ అశోక్, ఆర్ఐ ఆదాం, వీఆర్వోలు ఆనంద్, భీముడు పాల్గొన్నారు.