కోసిగి మండలంలోని మూగలదొడ్డి గ్రామంలో గురువారం బోయ నాగరాజు అనే వ్యక్తి అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు కోసిగి ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. మూగలదొడ్డిలో దాడులు నిర్వహించగా బోయ నాగరాజు పట్టపడ్డాడని అన్నారు. అతని వద్ద నుంచి 384 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు చెప్పారు.