కోసిగి మండలంలోని మూగలదొడ్డిలో భారీ మొసలి రైతుల కంట పడింది. గ్రామానికి చెందిన రైతు దౌళ్ల వీరారెడ్డి పొలం సమీపంలోని ముళ్ల చెట్ల మధ్యలో సుమారు 200 కేజీల బరువు, 9 అడుగుల పొడవు ఉన్న భారీ మొసలిని రైతులు, గ్రామస్థులు గుర్తించారు. సోమవారం అప్రమత్తమై గ్రామస్థులకు, రైతులకు, ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు మొసలిని గ్రామస్తుల సహకారంతో తాళ్లతో బంధించి బయటకు తీశారు.