మంత్రాలయం: భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

71చూసినవారు
మంత్రాలయం: భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ వివాదాలు కొలిక్కి వచ్చేలా ఆధికారులు చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. మంగళవారం కౌతాళం మండలం హాల్విలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ భరద్వాజ్ హాజరయ్యారు. రెవెన్యూ సదస్సుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి, వారి సమస్యలను సబ్ కలెక్టర్ కు విన్నవించారు. తహశీల్దార్ మల్లికార్జునస్వామి, డీటీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్