ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్నికోసిగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం టీడీపి ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి ప్రారంభించారు. గత టిడిపి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ వచ్చాక తొలగించి పేద విద్యార్థుల నోటికాడ కూడు తీశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆకలి తీర్చడానికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ పథకం తిరిగి అమలు చేసిందన్నారు.