పెద్దకడబూరులో మిరప పొలంలో దొంగలు..!

62చూసినవారు
ఓవైపు ధరలు లేక మిరప రైతులు ఆవేదన చెందుతుంటే మరోవైపు దొంగలు తమ మిరప పంటలను నాశనం చేస్తున్నారని పెద్దకడబూరు మండలం రైతు మంచోది రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికిరాత్రే చెట్లకు ఉన్న మిరపకాయలను దొంగలపాలయ్యయని వాపోయారు. ఎకరాకు రూ. లక్ష చెప్పున పెట్టుబడి పెట్టామని, ప్రస్తుత రేట్లను చూస్తే పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందన్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్