15 వందల లీటర్ల నీటిని 450 రూపాయలకు విక్రయం

599చూసినవారు
15 వందల లీటర్ల నీటిని 450 రూపాయలకు విక్రయం
నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా, హాజనగర్ మరికొన్ని కాలనీలలో నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి ట్యాంకర్ 350 నుండి 400, రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. 1500 లీటర్ల పెద్ద ట్యాంకును 450 రూపాయలకు విక్రయిస్తున్నారు. మంచినీటి కొరతను కొంతమంది వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే నిటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్