నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ హైస్కూల్ 1980 - 91 పూర్వ విద్యార్థులు గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గర్భిణీలకు మరియు రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. వేదవ్యాస్, సతీష్ మాట్లాడుతూ వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి, వారి సహాయకులకు స్వాతంత్ర దినోత్సవ రోజున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. గర్భిణీ స్త్రీలు డాక్టర్ల సూచనలు పాటిస్తూ పౌష్టిక ఆహరం తీసుకోని జాగ్రత్తలు పాటించాలన్నారు.