ఇళ్ల స్థలాలకై ఈనెల 18న అన్ని సచివాలయాల ముందు చేపట్టే ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు పిలుపునిచ్చారు. గురువారం నందికొట్కూరులో మాట్లాడుతూ.. పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు స్థలము ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయం ముందు సంబంధిత కరపత్రాలు విడుదల చేశారు.