జాతీయ రహదారుల నిర్మాణాల పూర్తికి ప్రతి ఒక్కరు సహకరించాలని, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా కోరారు. మంగళవారం పాములపాడు మండలంలోని 340-సి జాతీయ రహదారి (కర్నూలు-దోర్నాల) నిర్మాణ పనులను జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, జాతీయ రహదారుల అధికారుల బృందంతో కలిసి కలెక్టర్ పర్యవేక్షించారు. ఆమె మాట్లాడితూ.. నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించి, సంబంధిత భూములను స్వాధీనం చేసుకొని, ఎన్ హెచ్ అధికారులకు అప్పగించి, రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామన్నారు.