నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం బన్నూరు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త మహమ్మద్ షరీఫ్ (46) బుధవారం మృతి చెందారు. మండల టిడిపి కన్వీనర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ బుధవారం బన్నూరు గ్రామానికి చేరుకొని మహమ్మద్ షరీఫ్ మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు అహమ్మద్, వార్డు మెంబర్ సురేష్, సోమశేఖర్ గౌడ్, శేఖర్ యాదవ్, ఉస్మాన్ భాష తదితరులు పాల్గొన్నారు.