కొత్తపల్లి మండల పరిధిలోని సప్తనది సంగమేశ్వరం నుండి తెలంగాణ రాష్ట్రం సోమశిలకు బోటు ప్రయాణానికి అన్ని అనుమతులు ఉన్న కృష్ణానదిలో బోటును ఎందుకు తిరగనివ్వడం లేదని జడ్పిటిసి సోమల సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం మండల పరిధిలోని సిద్దేశ్వరం గాట్ బోటును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కృష్ణా నదిలో బోటు తిప్పుకునేందుకు అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నుండి, పోర్టు అధికారుల నుండి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు.