విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు చెకుముకి సైన్స్

65చూసినవారు
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు చెకుముకి సైన్స్
కర్నూలు పట్టణంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం 15,000 మంది విద్యార్థులకు సైన్స్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. విద్యార్థులందు సృజనాత్మకతను పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనలు రేకెత్తించడం ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ తెలియజేశారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, కౌతాళం, కోసిగి, కర్నూలు, కల్లూరు, తదితర మండలాల్లో ఈ పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్