వైద్యశాఖలో అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్న ఆశావర్కర్లకు రిటైర్డుమెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని సీఐటీయూ ఓర్వకల్లు మండల కార్యదర్శి షాజాహాన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఓర్వకల్లు మండలంలోని నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడారు. ఆశావర్కర్ల సమస్యలపై నిర్లక్ష్యం తగదన్నారు. అనంతరం వినతిపత్రాన్ని వైద్యాధికారి డా. నాగరాజుకు సమర్పించారు.