పాణ్యం అభివృద్దే అజెండాగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో గళం వినిపించారు. ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తానన్న హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. దేశంలో 12 మ్యాన్యూప్యాక్చర్ క్లస్టర్లు మంజూరు కాగా, రాష్ట్రానికి మూడు వచ్చాయని, అందులో ఓర్వకల్లు ఒకటన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు రూ. 2800 కోట్లు మంజూరు చేయించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు.