కర్నూలు జిల్లాలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గురువారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రైతుల పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడంతో పాటు, రైతుల పంట నిల్వ కోసం సీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి డిమాండ్ చేశారు. చేతికి వచ్చిన ఉల్లి తడిసిపోయి అమ్మకానికి ఇబ్బంది పడుతున్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.