పత్తికొండ: నూతన మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలి

77చూసినవారు
ఏపీలో నూతన మద్యం పాలసీ విధానంలో గీత కార్మికులకు పది శాతం దుకాణాలను కేటాయించాలని ఏపీ చేతివృత్తుల సమాఖ్య జిల్లా సమితి కార్యదర్శి కారన్న, శ్రీనివాసులు కోరారు. సోమవారం పత్తికొండలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి విశ్వేశ్వరరావును కలిసి వినతి పత్రం అందజేశారు. కల్లు గీత సొసైటీలకు మాత్రమే 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కల్లు వృత్తిని కాకుండా, వ్యాపారాలతో ఆర్థికంగా స్థిరపడిన వారికి ఇవ్వద్దన్నారు.

సంబంధిత పోస్ట్