శ్రీశైలం డ్యాంలో మృతిచెందిన చేపలను తిని పందులు మృతి

551చూసినవారు
శ్రీశైలం డ్యాంలో మృతిచెందిన చేపలను తిని పందులు మృతి
శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణానదిలో శనివారం కుప్పలు తెప్పలుగా మృతిచెందిన చేపలను తిని పందులు మృత్యువాత పడ్డాయి. నీరు కలుషితం వల్లే చేపలు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకొచ్చాయని, వాటిని తిని లేదా ఆ నీటిని తాగి పందులు మృతిచెంది ఉండవచ్చు అని స్థానికులు చెబుతున్నారు. అదే నీటిని మనుషులు తాగితే ప్రాణాలకే ప్రమాదం ఉండవచ్చని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్