నంద్యాల జిల్లా ఆత్మకూరు నందు ఇస్తామా జరుగుతున్న సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని నంద్యాల జిల్లా ఎస్పీ అతి రాజ సింగ్ రాణా మంగళవారం ఆత్మకూరులో అన్నారు. జిల్లా ఎస్పీ పార్కింగ్ ప్రదేశాలు , కంట్రోల్ రూమ్, సభాస్థలి మొదలగు ముఖ్యమైన ప్రాంతాలను స్వయంగా సందర్శించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ పాల్గొన్నారు.