శ్రీశైల దేవస్థానం ఆవరణలోని సుబ్రమణ్యేశ్వర స్వామికి సోమవారం షష్టి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సేవలో భాగంగా సుబ్రహ్మణ్యం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు పూజా కైంకర్యాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. అలాగే స్వామివారికి ప్రత్యేక అలంకరణ గావించి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.