శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం గురువారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా మహాగణపతి పూజ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊయలలో ఆశీనులనుజేసి శాస్త్రక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ పూజలు, స్వామికి సహస్ర నామార్చన పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు.