గోనెగండ్లకు చెందిన బోయ రంగస్వామి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగస్వామి కుమార్తెకు వివాహం కోసం తెలిసిన వారి దగ్గర నగదు అప్పు తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి నల్గొండ జిల్లాకు వలస వెళ్లారు. ఈ స్థితిలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలో దాచిన 2 తులాల బంగారం దొంగలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.