ఎమ్మిగనూరు పట్టణంలోని హౌసింగ్ లేఅవుట్లోని ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. గురువారం ఎమ్మిగనూరులో సబ్ కలెక్టర్, కమిషనర్ గంగిరెడ్డి, హౌసింగ్ అధికారులతో కలిసి హౌసింగ్ లే అవుట్లోని నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అన్ని వసతులు కల్పించాలని పట్టాదారులు వచ్చి ఇక్కడ నివాసం ఉండడానికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.