ఎమ్మిగనూరు: అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి

58చూసినవారు
ఎమ్మిగనూరు: అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి
ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్ వద్ద ఉన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలను గురువారం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కాగా, సమీపంలోని జోగి కాలనీలో మంచినీటి సమస్యను కాలనీలోని మహిళలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి ఆయన హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్