ఏపీలో 41 అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ జాబితాలో కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు నేతలకు చోటు దక్కింది. బేస్త విభాగం రాష్ట్ర అధ్య క్షుడిగా టీ. అనిల్ కుమార్, వీరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మిగనూరుకు చెందిన వై. రుద్ర గౌడ్ నియమితులయ్యారు.