ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్నూలుకు చెందిన షేక్షావలి ద్విచక్ర వాహనంపై భార్యతో కలిసి ఎమ్మిగనూరులో జరిగే నీలకంఠేశ్వర స్వామి రక్షత్సవానికి బయల్దేరాడు. ఎర్రకోట చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. షేక్షావలితో పాటు ఆయన భార్య, ఆటోలో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి.