ఎమ్మిగనూరు మండలంలో డిసెంబరు 14వ తేదీన ఆయా గ్రామాల్లో జరిగే సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలపై తహశీల్దార్ శేషఫణి శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో 6 వేల మంది సభ్యులు ఉన్నారన్నారు. 4 వాటర్ యూజర్ అసోసియేషన్లు, 2 మైనర్ ట్యాంకులకు సంబంధించి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 14వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయన్నారు.