గోవిందమ్మకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని ప్రజా సంఘ నాయకులు అన్నారు. బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక సోమప్ప సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్లుకుంట గ్రామంలో గోవిందమ్మ పై జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ, కలెక్టర్, హోం మినిస్టర్ లు వచ్చేంత వరకు పోరాడతామని డిమాండ్ చేశారు.